: ఆయన కేంద్ర మంత్రా?...నాలుక్కరుచుకున్న ఆనంద్ శర్మ!
రాజ్యసభలో ఓ తమాషా సంగతి చోటుచేసుకుంది. సభలో జీరో అవర్ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వ తీరుపై ఓ ప్రశ్న సంధించిన కాంగ్రెస్ డిప్యూటీ నాయకుడు ఆనంద్ శర్మ తన పొరపాటు తెలుసుకుని నవ్వేశారు. జీరో అవర్ లో ఆనంద్ శర్మ మాట్లాడుతూ, జీరో అవర్ సమయంలో కేంద్ర మంత్రులు లేకపోవడం శోచనీయమని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ తో అన్నారు. దీంతో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్ చాంద్ గెహ్లాట్ లేచి చాలా సేపటి నుంచి తాను సభలోనే ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులెవరూ లేరని ఆరోపించడం న్యాయమా? అని ఆనంద్ శర్మను ప్రశ్నించారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ 'ఆయన ఉన్నారు కదా?' అని చెప్పడంతో, ఆయన గురించి పెద్దగా తెలియదని చెబుతూ ఆనంద్ శర్మ నవ్వేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలోని ఇతర నేతలు కూడా నవ్వేశారు.