: బీమా రంగంలో 49 శాతం ఎఫ్ డీఐకి గ్రీన్ సిగ్నల్
బీమా రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎఫ్ ఐపీబీ ద్వారా తీసుకునే ఈ పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. ఎఫ్ డీఐల ద్వారా బీమా రంగంలో రూ. 25 వేల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రమంత్రివర్గ తాజా నిర్ణయంతో ప్రైవేటు బీమా రంగంలో విదేశీ నిధుల వరద ఖాయంగా కనిపిస్తోంది.