: టీమిండియాకు సచిన్ హెచ్చరిక
విఖ్యాత లార్డ్స్ మైదానంలో టెస్టు గెలవడం పట్ల సంతోషించాల్సిందేనని, అయితే, సిరీస్ లో మిగిలిన మ్యాచ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సచిన్ టీమిండియాను హెచ్చరించాడు. లార్డ్స్ విజయాన్ని అంతటితో మర్చిపోయి, సిరీస్ పై సీరియస్ గా దృష్టిపెట్టాలని సూచించాడు. కాగా, విదేశీ గడ్డపై భారత్ ఎన్నోమార్లు ఇలాంటి పరిస్థితుల్లో బోల్తాపడిన నేపథ్యంలో సచిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, లార్డ్స్ విజయం గాలివాటం కాదని నిరూపించాలంటే భారత్ ఈ సిరీస్ లో మిగిలిన మూడు టెస్టుల్లో సత్తా చాటకతప్పదు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో గెలుపొందడంతో భారత్ ఈ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.