: బీజేపీ ఎంపీలకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన మోడీ
బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాస్త కఠినమైన రూల్స్ విధించారు. ఆ రూల్స్ ఏంటంటే.... * పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీజేపీ సభ్యులు విదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోను వెళ్లకూడదు. * పార్టీ కీలక సమావేశాలకు బీజేపీ ఎంపీలు కచ్చితంగా హాజరుకావాలి. * పార్టీ అధికార ప్రతినిధులు కచ్చితంగా ప్రతి మంగళవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమవ్వాలి. * పార్టీని సంప్రదించకుండా బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో ఏ రకమైన తీర్మానాలనూ ప్రవేశ పెట్టకూడదు. కాగా, దీనిపై స్పందిస్తూ... ప్రతి వారం పార్టీ సమావేశాల వివరాలను మోడీకి పంపిస్తామని... పార్టీ ఎంపీల పని తీరును మోడీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఎంపీల పనితీరును బట్టే వారికి తరువాతి రోజులలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై నిర్ణయం తీసుకుంటామని వెంకయ్యనాయుడు తెలిపారు.