: టీఆర్ఎస్ తో టీడీపీ ఎమ్మెల్యేల రహస్య మంతనాలు
టీడీపీ నేతలు మరికొందరు టీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ టీఆర్ఎస్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని హరీశ్వర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఈయన ఈరోజు ఎమ్మెల్యే తారకరామారావును కలిసి వివరించినట్లుగా తెలుస్తోంది.