: 'సైకిల్'పై స్వారీ చేసేందుకు జగ్గారెడ్డి రెడీ..?


తెలంగాణాలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ప్రజాకర్షణ ఉన్న ముఖ్యనాయకులపై ఆయన దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు మాస్ ఇమేజ్ ఉన్న లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు సూచన మేరకు మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళ ఇటీవల జగ్గారెడ్డిని సంప్రదించారు. చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని జగ్గారెడ్డి శశికళకు స్పష్టం చేసినట్టు సమాచారం. 2019లో టీడీపీని తెలంగాణాలో అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కు క్రమంగా దూరమవుతున్న రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తమ వైపుకు తిప్పుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News