: కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమైన 'పరుగుల చిరుత'


జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కామన్వెల్త్ క్రీడలకు సిద్ధమయ్యాడు. మార్చిలో బోల్ట్ ఎడమపాదం గాయానికి శస్త్రచికిత్స నిర్వహించారు. దీంతో, గత తొమ్మిది వారాలుగా శిక్షణకు దూరమైన బోల్ట్ ఇటీవలే ట్రాక్ పైకి వచ్చాడు. గతంలో రెండు పర్యాయాలు గాయాల నుంచి కోలుకున్నానని, ఇప్పుడూ అలాగే కోలుకుని సత్తా చాటుతానని ప్రాక్టీసు సందర్భంగా వ్యాఖ్యానించాడు బోల్ట్. పూర్వ సామర్థ్యం కోసం కఠోరంగా శ్రమిస్తున్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News