: సచిన్ ముందే ఊహించాడట!


లార్డ్స్ టెస్టులో భారత్ విజయం సాధిస్తుందన్న విషయాన్ని తాను ముందే ఊహించానని బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఆ మ్యాచ్ తొలిరోజు ఆటను తనయుడు అర్జున్ తో కలిసి వీక్షించిన సచిన్... ఆ రోజు ఆటలో టీమిండియా ప్రదర్శన చూసిన తర్వాత, గెలుస్తుందన్న అంచనాకు వచ్చానని వివరించాడు. యువజట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. " మొదటి రోజు మ్యాచ్ అనంతరం, అర్జున్ తో మనదే పైచేయి అని చెప్పాను" అని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తొలి ఇన్నింగ్స్ లో బాగా ఆడి ఉంటే మాత్రం వారికే మెరుగైన అవకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News