: మధ్యప్రదేశ్ కు తరలిపోయిన వాయుగుండం
ఉభయరాష్ట్రాల రైతులను నిరాశపరుస్తూ వాయుగుండం మధ్యప్రదేశ్ కు తరలిపోయింది. దీంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తా మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.