: అనుమానాస్పదంగా మహిళా నిర్మాత మృతి
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాలోని వైశాలి ప్రాంతంలో మహాగన్ సోసైటీ అపార్టుమెంట్ లోని ఎనిమిదో అంతస్థు నుంచి పడి ఓ మహిళా నిర్మాత మృతి చెందింది. మృతురాలిని స్థానిక టీవీ ఛానెల్ లో పనిచేసే మహిళా నిర్మాత మిలితా దత్ మండల్ గా పోలీసులు గుర్తించారు. గత రాత్రి 11 గంటలకు మహగన్ సోసైటీ అపార్టుమెంటులోని తన నివాసానికి చేరుకున్న దత్, మరో 40 నిమిషాలకు అనుమానాస్పద స్థితిలో కింద పడి మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని, కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. ఆమె మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.