: ఆగని బంగారం, వెండి ధరల పతనం
బంగారం ధరలు ఈ రోజు కూడా పతనం దిశగానే సాగుతున్నాయి. ఈ రోజు స్పాట్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం ధర మరో 1500 పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములు 25,980 వద్ద ట్రేడవుతోది. 22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు 25,280 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి కూడా 2500 పడిపోయి 45,300 వద్ద ట్రేడవుతోంది.