: ప్రతిపక్షాలు అసాధ్యం అన్న దాన్ని సుసాధ్యం చేసి చూపించాం: మంత్రి ప్రత్తిపాటి
రైతురుణాలు మాఫీ చేయడం అసాధ్యమని ప్రతిపక్షాలు నానా రభస చేశాయని... అయితే దాన్ని తాము సుసాధ్యం చేసి చూపామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ. 16 వేల కోట్ల లోటుతో ఉన్నప్పటికీ... తాము రుణ మాఫీ చేయబోతున్నామని చెప్పారు. బంగారంపై కూడా రుణమాఫీ చేస్తున్నామని... మన దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని తెలిపారు. వైకాపా అధినేత జగన్ లాంటి ప్రతిపక్ష నేతల అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని అన్నారు.