: మేనిఫెస్టో ఆలస్యం కావడంతోనే నష్టపోయాం: షబ్బీర్ అలీ
టీఆర్ఎస్ లాగ రైతు రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టనందుకే కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లిందని టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలిపారు. మేనిఫెస్టో ఆలస్యం కావడం కూడా పార్టీని దెబ్బతీసిందని చెప్పారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందంటూ సికింద్రాబాద్ లో సోనియాగాంధీ సభను నిర్వహించి ఉంటే... కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో పొన్నాల అధ్యక్షతన జరిగిన 'ఎన్నికల ఫలితాలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ' అనే చర్చలో మాట్లాడుతూ షబ్బీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కొంతమంది వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు.