: ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఢీకొన్న వాహనాలు


శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టెక్కలికి చేరుకున్నారు. అయితే ఆయన పర్యటనలో చిన్న ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి వెంట వెళుతున్న మంత్రి ధర్మాన కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరికి గాయాలైనట్లు సమాచారం. కాగా, టెక్కలిలో ముఖ్యమంత్రి అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించి,ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం గజపతినగరం వెళతారు.

  • Loading...

More Telugu News