: సమంతను చుట్టుముట్టిన సినిమా కష్టాలు
సినీ నటి సమంతను సినిమా కష్టాలు చుట్టుముట్టాయి. తమిళంలో సినీ నటుడు సూర్య సరసన 'అంజాన్' సినిమాలో సమంత నటించింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రోజు చెన్నైలో జరుగనుంది. కాగా, సమంత ఇంకో సినిమా షూటింగ్ కోసం వేరే చోట ఉంది. దీనిపై సమంత ట్విట్టర్లో కామెంట్ చేసింది. "ఈ రోజంత దరిద్రమైన రోజు ఇంకోటి లేదు. ఫ్లైట్ ఆలస్యానికి తోడు ట్రాన్సిట్ లో లగేజీ పోగొట్టుకున్నాను. దీనికి తోడు ఫుడ్ పాయిజనింగ్ అయింది. 'అంజాన్' సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొనలేకపోతున్నందుకు బాధగా ఉంది" అని ట్వీట్ చేసింది. మొత్తానికి సమంత 'అంజాన్' ఆడియో ఫంక్షన్ ఎగ్గొట్టింది.