: కౌలు రైతులకు రుణాలివ్వాలి: సీపీఐ
ఈసారైనా కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.