: ఆ ఫోన్ అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ను క్రాష్ చేశాయి


ఊహించని డిమాండ్ తో ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్.కామ్ వెబ్ సైట్ క్రాష్ అయింది. గతేడాది మోటో జి, మోటో ఈ మొబైల్ ఫోన్ల అమ్మకాలతో వినియోగదారుల ఆదరణ చూరగొన్న ఫ్లిప్ కార్ట్.కామ్ జియోమీ ఎంఐ3 అమ్మకాలను ఎక్స్ క్లూజివ్ గా ప్రారంభించింది. అమ్మకాలు 12 గంటలకు ఆరంభించగానే వినియోగదారులు పెద్దఎత్తున ఆర్డర్లు ఇచ్చారు. ఒకేసారి ఎక్కువమంది వినియోగదారులు వైబ్ సైట్ ను సందర్శించడంతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ కు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో జియోమీ ఎంఐ3 అమ్మకాలను 10వేలకు పరిమితం చేశారు. సమస్యలు పరిష్కరించడంతో ఫ్లిప్ కార్ట్ మళ్లీ సేవలు పునరుద్ధరించింది.

  • Loading...

More Telugu News