: కుక్ పనైపోయింది: రికీ పాంటింగ్
ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ (29) పనైపోయిందంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఇక అతను ఆటపరంగా మెరుగవడం కల్ల అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టు దారుణ ప్రదర్శనలు కుక్ బ్యాటింగ్ పై ప్రభావం చూపుతున్నాయని, అందులో ఎలాంటి సందేహం లేదని విశ్లేషించాడు. ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ తో మాట్లాడుతూ పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ మెరుగుపర్చుకునేందుకు కుక్ మార్గాలు అన్వేషించాలని ఈ దిగ్గజ బ్యాట్స్ మన్ సూచించాడు. కాగా, కుక్ గత 27 ఇన్నింగ్స్ లలో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. చివరి 9 టెస్టు ఇన్నింగ్స్ లలో కేవలం 129 పరుగులే చేశాడు.