: ఫేస్ బుక్ లో ఇకపై 'సేవ్' సౌకర్యం
గూగుల్ లో విహరించేటప్పుడు మనకునచ్చిన సైట్లను 'బుక్ మార్క్' చేసుకోవడం సాధారణమైన విషయం. దీంతో, మరలా ఆ వెబ్ సైట్ పేరును టైప్ చేసి సెర్చ్ ఇంజిన్లలో వెదుకులాడే సమస్య ఉండదు. ఇప్పుడు ఫేస్ బుక్ లోనూ 'బుక్ మార్క్' తరహాలో 'సేవ్' చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఫేస్ బుక్ లో మనకు కనిపించే ఐటమ్స్, ప్లేసులు, టీవీ, మ్యూజిక్, సినిమాలు... ఇలా ఎన్నో లింకులను సేవ్ చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో ఎక్కువమంది మొబైల్ ఫోన్ల ద్వారా ఫేస్ బుక్ కు కనెక్ట్ అవుతున్నారు. వారు ఫోన్ ద్వారా నెట్లో ఆయా సైట్లను వెదకాలంటే ఎంతో సమయం పడుతుంది. తాజాగా ప్రవేశపెట్టిన 'సేవ్' సౌకర్యం ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుంది.