: 'లార్డ్స్' విజయంపై సందీప్ పాటిల్ అభినందన


సుప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో టీమిండియా ఘనవిజయం సాధించడం పట్ల మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. ఈ చారిత్రక విజయంపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ, భారత జట్టు గెలుపు తననెంతో ఉద్విగ్నతకు గురిచేసిందని తెలిపారు. విక్టరీ క్రెడిటంతా జట్టు మొత్తానికి వర్తిస్తుందని పేర్కొన్నాడు. విజయానికి ఏ ఒక్కరో కారకులని తాను చెప్పబోనన్నారు. ఇది సమష్టి కృషి అని అభినందించారు. ఇది ప్రారంభమేనని, సాధించాల్సింది ఎంతో ఉందని టీమిండియా సభ్యులకు సూచించాడు. ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. గతేడాది సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అనంతరం యువకులతో కూడిన టీమిండియాకు ఇంగ్లండ్ పర్యటన సవాల్ వంటిదని పాటిల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News