: బాల్యవివాహాల విషయంలో భారత్ కు ఎదురులేదు
భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ... ఆడపిల్లల బాల్యవివాహాలు ఇప్పటికీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయని యునైటెడ్ నేషన్స్ ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతీ మూడు బాల్యవివాహాల్లో ఒకటి భారత్ లోనే జరుగుతోందని యునైటైడ్ నేషన్స్ స్పష్టం చేసింది. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల కంటే దక్షిణాసియాలో ఆడపిల్లల బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం ఆడపిల్లల బాల్యవివాహాల విషయంలో భారత్ ఆరవ స్థానంలో ఉంది.