: అనంతపురం టీడీపీలో విభేదాలు
అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు తలెత్తాయి. అనంతపురం లలిత కళాపరిషత్ లో నిర్వహించిన టీడీపీ సమావేశం రసాభాస అయింది. వైఎస్సార్సీపీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో, ఆయనపై అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విరుచుకుపడ్డారు. పార్టీ కార్యకర్తల ముందే ఎమ్యెల్యేలిద్దరూ వాగ్వివాదానికి దిగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.