: తెలంగాణలో నేవీ రాడార్ కేంద్రం


దేశ రక్షణ రంగ అవసరాలకు తోడ్పడేందుకు వీలుగా కేంద్రం తెలంగాణలో నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం స్థాపనకు 2900 ఎకరాలు అవసరం కాగా, తెలంగాణ సర్కారు రంగారెడ్డి జిల్లా పూడూరులో భూకేటాయింపునకు అంగీకరించింది. ఈ మేరకు తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ సతీశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. భూములకు సంబంధించి క్లియరెన్స్ ఇవ్వాలని ఆయన కేసీఆర్ ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వెంటనే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తీరప్రాంతంలో ఉండే రాడార్ స్టేషన్లకు శత్రుదేశాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఈ నూతన రాడార్ కేంద్రాన్ని తీర ప్రాంతానికి దూరంగా నెలకొల్పాలని రక్షణ శాఖ నిర్ణయించింది. మరో మూడు నెలల్లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభం అవుతాయి. ఈ రాడార్ కేంద్రం ద్వారా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాల్లో ఓడల సంచారంపై నిఘా వేసేందుకు వీలవుతుంది. కాగా, ఈ రాడార్ కేంద్రం నిర్మించ తలపెట్టిన పూడూరు ప్రాంతంలో 400 ఏళ్ళనాటి శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. దీనిపై చర్చించిన అధికారులు ఆలయంలో స్థానికుల పూజాదికాలకు అడ్డుతగలరాదని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News