: తండ్రి అయిన జూనియర్ ఎన్టీఆర్


నందమూరి ఇంట మరో వారసుడు జన్మించాడు. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయ్యారు. జూ.ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో ఈ ఉదయం 11 గంటలకు లక్ష్మీప్రణతి మగబిడ్డకు జన్మనిచ్చారు. జూనియర్ కు మరో జూనియర్ జన్మించడంతో నందమూరి, నార్నే కుటుంబాల్లో సందడి నెలకొంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, సోదరుడు కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి వెళ్లి తమ వారసుడిని చూశారు. ఈ సందర్భంగా హరికృష్ణ ఫోన్లు చేస్తూ పలువురితో తన ఆనందాన్ని పంచుకున్నారు.

  • Loading...

More Telugu News