: ఇంగ్లండ్ కెప్టెన్ పై దాడి మొదలైంది!
లార్డ్స్ టెస్టు ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పై విమర్శకుల దాడి మొదలైంది. ఈ సిరీస్ కు ముందే కుక్ ను కెప్టెన్ పదవి వీడాలని సూచించిన పలువురు మాజీ క్రికెటర్లు మరోసారి అస్త్రాలు ఎక్కుపెట్టారు. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా లార్డ్స్ లో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 95 పరుగుల తేడాతో ఓడిపోవడంతో వారి వాదనకు మరింత బలం చేకూరినట్టయింది. ఈ క్రమంలో కుక్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటే మేలని మాజీ కెప్టెన్ నాసిర్ హస్సేన్ అభిప్రాయపడ్డాడు. కుక్ ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించాడు. కుక్ ఇప్పటికిప్పుడు జట్టుకు దూరమైనా నష్టమేమీ ఉండదని పేర్కొన్నాడు.