: కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకధారి షూటర్ విజయ్ కుమార్


ఒలింపిక్స్ షూటింగ్ లో రజత పతక విజేత విజయ్ కుమార్ కు కామన్వెల్త్ క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ధరించే భాగ్యం లభించింది. బ్రిటన్ లోని గ్లాస్గోలో ఈ క్రీడల ప్రారంభోత్సవం బుధవారం జరగనుంది. ఈ వేడుకలో విజయ్ కుమార్ భారత బృందానికి నేతృత్వం వహిస్తాడని భారత చెఫ్-డి-మిషన్ రాజ్ సింగ్ తెలిపారు. కాగా, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ ను విజయ్ కుమార్ కు (రిజర్వ్) ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు.

  • Loading...

More Telugu News