: ధోనీ సహకారం వల్లే సాధ్యమైంది: ఇషాంత్


లార్డ్స్ టెస్టు రెండో ఇన్సింగ్స్ లో చెలరేగి బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ కెప్టెన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. లార్డ్స్ లో ఇషాంత్ మాట్లాడుతూ, ధోనీ సూచించినట్టు బౌలింగ్ చేయడంతో ఉత్తమ ఫలితం రాబట్టానని అన్నాడు. కీపర్ గా, అనుభవజ్ఞుడిగా పిచ్ స్వభావాన్ని అంచనా వేసిన ధోనీ బౌన్సర్లు వేయాలని తనకు సూచించాడని లంబూ చెప్పాడు. జట్టు సభ్యుల్లో ధోనీ ఉత్సాహం నింపడమే కాకుండా, అద్భుతంగా ప్రోత్సహించాడని ఆయన తెలిపాడు. కెప్టెన్ అండతోనే కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశానని ఇషాంత్ స్పష్టం చేశాడు. రెండో టెస్టులో ఏడు వికెట్లు తీయడంతో ఇషాంత్ శర్మను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

  • Loading...

More Telugu News