: తెలంగాణ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్
తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాసనసభ్యులకు నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయం, నివాసం ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన భూమిని సేకరించాల్సిందిగా జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతో కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. సొంత నివాసాల్లోనే నివాసముంటున్నారు. కొంత మంది శాసనసభ్యులు ప్రభుత్వ నిధులతో సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.