: ఫేస్ బుక్ లో సెల్ఫీ దొంగను పట్టించింది


ఫేస్ బుక్ ఓ దొంగను పట్టించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో కెర్ట్ విలియమ్స్ కు చెందిన దుస్తుల దుకాణం నుంచి డెలియల్ సాక్స్ టన్ (27) అనే మహిళ ఖరీదైన దుస్తులను దొంగతనం చేసింది. దొంగతనం జరిగిందని ఆయన ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెతికారు. అయినా దొంగ దొరకలేదు. ఏం చేయాలా? అని ఆలోచించిన విలియమ్స్ పోయిన దుస్తుల ఫోటోలను ఫేస్ బుక్ లో ఆప్ లోడ్ చేశాడు. దుస్తులు సంగతి చెప్పి ఎవరైనా ధరిస్తే తనకు వివరాలు అందజేయాలంటూ కోరాడు. ఈ విషయం తెలియని డెలియట్ దొంగతనం చేసిన దుస్తులతో స్టైల్ గా సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. ఆమె ఫోటోలను, పోయిన దుస్తుల ఫోటోలను చూసిన ఓ ఫెస్ బుక్ ఫ్రెండ్ విలియమ్స్ కు సమాచారం అందించాడు. ఆ దుస్తులు తనవేనని గుర్తించిన షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. అలా ఫేస్ బుక్ ఓ దొంగను పట్టించింది.

  • Loading...

More Telugu News