: భారత్ లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు... తొలిసారి తమిళనాడు పర్యటన


ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ ఈ రోజు భారత్ వచ్చారు. మొత్తం మూడు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటిస్తారు. మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ఆయన అక్కడి నుంచి నేరుగా తొలిసారి తమిళనాడు వెళ్లారు. ఎయిర్ పోర్టులో అధ్యక్షుడు మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆటోమొబైల్ రంగానికి తమిళనాడు మంచి ప్రదేశమన్నారు. తమ బ్యాంకు సభ్యత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడువందల సభ్యత్వాలు వున్నాయని పేర్కొన్నారు. ముందుగా చెన్నైలో తమ బ్యాంకు సభ్యులతో సమావేశమయ్యాక తర్వాత ముఖ్యమంత్రి జయలలితతో ఆయన భేటీ అవుతారు.

  • Loading...

More Telugu News