: విమానం కూలిన ప్రదేశంలో కాల్పుల విరమణ: ఉక్రెయిన్
మలేసియా విమానం కూలిపోయిన ప్రదేశంలో కాల్పుల విరమణ పాటించాలని ఉక్రెయిన్ దళాలకు ఆ దేశాధ్యక్షుడు పొరొషెంకో ఆదేశాలు జారీ చేశారు. విమానం కూలిన ప్రదేశం రష్యన్ అనుకూల, ఉక్రెయిన్ వ్యతిరేక తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాల్పుల విరమణతో మృతదేహాలు, సాక్ష్యాధారాల సేకరణ సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడి ఆదేశాలతో విమానం కూల్చివేతకు గురైన ప్రదేశానికి 40 కిలోమీటర్ల వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి.