: పోర్టు నిర్మాణ రంగంలోకి జీఎంఆర్... 2500 కోట్లతో కాకినాడలో జీఎంఆర్ పోర్టు


విమానాశ్రయాల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన జీఎంఆర్ సంస్థ పోర్టు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేసెజ్) బ్యాక్ యార్డులోని భారీ పోర్టు నిర్మాణంపై జీఎంఆర్ సంస్థ ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ పోర్టును నిర్మించేందుకు జీఎంఆర్ ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. కాకినాడ సెజ్ కు కేటాయించిన 10,500 ఎకరాల్లో పోర్టు కోసం 2,100 ఎకరాలు కేటాయించనున్నట్టు సమాచారం. సుమారు 2,500 కోట్ల రూపాయలతో తూర్పు తీరంలో అతిపెద్ద, అత్యాధునిక కార్గో హబ్ గా దీనిని నిర్మించనున్నారు. కార్గో, కంటైనర్ కార్గో, ఎగుమతి, దిగుమతులకు పూర్తి సౌకర్యాలతో మూడేళ్లలో నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్టు జీఎంఆర్ తెలిపింది. దీనిపై ఆరునెలల్లో పబ్లిక్ హియరింగ్ కు వెళ్తామని జీఎంఆర్ చెబుతోంది.

  • Loading...

More Telugu News