: సానియామీర్జాకు బంపర్ ఆఫర్... రూ. కోటి ప్రకటించిన కేసీఆర్
ఇండియన్ టెన్నిస్ స్టార్, హైదరాబాద్ అమ్మాయి సానియామీర్జాకు తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏకంగా కోటి రూపాయలను ఆమెకు నజరానాగా ప్రకటించారు. యూఎస్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు శిక్షణ కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. దీనికి సంబంధించిన చెక్ ను సానియాకు కేసీఆర్ రేపు ఇస్తారు.