: ఆంగ్ల టైటిల్స్ పెడితే సబ్సిడీ ఇవ్వమంటున్న కేరళ ప్రభుత్వం
కొత్తదనం, క్యాచీగా ఉండేందుకు ప్రస్తుతం దేశంలో సినిమాలకు ఇంగ్లీషు టైటిల్స్ పెడుతుండటం శృతిమించింది. దీనిపై దృష్టి పెట్టిన కేరళ ప్రభుత్వం తాజాగా మాతృభాషను బతికించుకోవాలనే యోచనలో ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మలయాళ చిత్ర రంగంలో ఎవరైనా సినిమాలకు ఆంగ్లంలో టైటిల్స్ పెడితే సబ్సిడీ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు అదూర్ గోపాల్ క్రిష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మాతృభాషలో తెరకెక్కించే సినిమాలకు సంబంధించి విధివిధానాలను పరిశీలించి అందుకు తగిన సహకారం అందివ్వనుందట.