: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... పలు కీలక నిర్ణయాలకు ఆమోదం


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. మొత్తం నాలుగు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాల్లో ప్రధానమైనవి... * తెలంగాణలో స్థానికత పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. * ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపించడం. * రూ. లక్షన్నర వరకు రైతు రుణమాఫీ. * మార్కెట్ కమిటీల రద్దుకు ఆర్డినెన్స్ తీసుకురావడం. * ఉల్లి ధరల నియంత్రణకు ప్రత్యేక నిధి. * ధరల నియంత్రణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు. * పెంచిన పింఛన్లు అక్టోబర్ 2 నుంచి అమలు.

  • Loading...

More Telugu News