: ఎన్ఎంయూ నుంచి మహమూద్ బహిష్కరణ


ఏపీఎస్ఆర్టీసీలో చక్రం తిప్పిన ఎన్ఎంయూ మాజీ ప్రధాన కార్యదర్శి మహమూద్ ను యూనియన్ నుంచి బహిష్కరించారు. ఈ రోజు గుంటూరులో జరిగిన ఎన్ఎంయూ రాష్ట్ర మహాసభలో బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న మహమూద్ పై సమగ్ర విచారణ జరపాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. దీనికితోడు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 24న ఎర్రబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని నేతలు తెలిపారు. అంతేకాకుండా, ఆగస్టు 5న అన్ని డిపోల వద్ద నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News