: మంత్రి పదవికి రాజీనామా చేసిన 'మహా' మంత్రి
మహారాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కు అందజేశారు. పదవికి రాజీనామా చేశానే తప్ప పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాణే శివసేన నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాజ్ పేయి ప్రధానిగా ఉండగా ఏర్పడిన శివసేన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ పృథ్వీరాజ్ చవాన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడంపై విభేదించిన రాణే అప్పుడే రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రితో పొసగని రాణే, ఎట్టకేలకు కేబినెట్ కు రాజీనామా చేశారు.