: జగన్ అక్రమాస్తుల కేసు నుంచి నా పేరు తొలగించండి: హెటిరో డైరెక్టర్


హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నుంచి తన పేరు తొలగించాలని అందులో కోరారు. మరోవైపు లేపాక్షి ఛార్జిషీట్ లో తనపేరు తొలగించాలంటూ ఐఏఎస్ అధికారి శ్యాంబాబు సీబీఐ న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. లేపాక్షి వ్యవహారంలో అధికారిగా మాత్రమే తాను బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ధారించిందని, తనపై విచారణకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రానికి సిఫార్సు కూడా చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. త్వరలో ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News