: ఎంసెట్ కౌన్సెలింగ్ కేసులో కౌంటరు దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి గడువు
ఎంసెట్ కౌన్సెలింగ్ కేసులో కౌంటరు దాఖలు చేసేందుకు ఏఐసీటీఈ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్ గడువు పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం నేడు విచారణ చేపట్టింది. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ వాదనలు కూడా వినాలనుకున్న న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. అటు కౌన్సెలింగ్ మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది.