: వికలాంగ బాలికపై కుక్కల దాడి... బాలిక మృతి


రాష్ట్రంలో పలుచోట్ల కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా, పదేళ్ల వికలాంగ బాలికపై కుక్కలు దాడి చేయడంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. మొత్తం నాలుగు కుక్కలు బాలికపై మూకుమ్మడిగా దాడి చేశాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఆ బాలికను చేర్పించగా... చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా వెంకోజిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

  • Loading...

More Telugu News