: కృత్రిమ మూత్రపిండాలు తయారవుతున్నాయ్
మూత్రపిండాల సమస్య వస్తే.. వాటికి రీప్లేస్‌మెంట్ తప్ప మరో రకమైన ప్రాణాలు కాపాడగల మార్గం ఇప్పటిదాకా మన ఎరికలో లేదు. ఇప్పటివరకూ కృత్రిమ మూత్రపిండాలు తయారు చేయడం అనే కాన్సెప్టు మనకు లేదు. అందుకే కిడ్నీలు అమ్ముకోవడం, కిడ్నీలు చోరీ చేయబడుతుండడం అనే నేరాలు అనేకం అప్పుడప్పుడూ మన దృష్టికి వస్తుంటాయి. ఇలాంటి కిడ్నీ బాధలకు చెల్లుచీటీ ఇచ్చేలా.. మసాచూసెట్స్ జనరల్ ఆస్పత్రికి చెందిన వైద్యులు కృత్రిమ కిడ్నీలను అభివృద్ధి చేశారు.
వీటిని ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు అవి విజయవంతంగా మూత్రాన్ని తయారుచేశాయి. ఎలుకలపై కూడా వీటితో పరిశోధనలు నిర్వహించారు. సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. మనిషి జీవకణాలనుంచి కూడా కృత్రిమ కిడ్నీలను తయారుచేసే దిశగా ఇప్పుడు పరిశోధన పురోగమించనున్నట్లు శాస్త్రవేత్త హరాల్డ్ ఒట్ అంటున్నారు.