: ఆహారంలో బొద్దింకను చూసి మండిపడిన 'రాజధాని' ప్రయాణికులు


దేశంలో ఆధునిక రైళ్ళుగా పేరు తెచ్చుకున్న రాజధాని ఎక్స్ ప్రెస్ లు 'పేరు గొప్ప ఊరు దిబ్బ' చందంగా తయారయ్యాయి. వాటిలో ప్రయాణికులకు సరఫరా చేసే అహారం నాసిరకంగా ఉంటోందని ఎప్పటినుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా, కోల్ కతా-న్యూఢిల్లీ (హజ్రత్ నిజాముద్దీన్) రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఓ ప్రయాణికుడు తనకు సరఫరా చేసిన ఆహారంలో బొద్దింకను చూసి విస్తుపోయాడు. ఈ సమాచారం రైల్లో మిగతా ప్రయాణికులకు కూడా తెలియడంతో వారు ఆందోళనకు దిగారు. యూపీలోని ముగుల్ సరాయ్ వద్ద గంటపాటు రైలును నిలిపివేశారు. కాగా, ఆ ఆహారాన్ని పాట్నా స్టేషన్ వద్ద రైలులోకి ఎక్కించినట్టు తెలుస్తోంది. రైల్వే మంత్రి సదానంద గౌడ ఇటీవలే మాట్లాడుతూ, ఆహార నాణ్యత విషయంలో రాజీపడబోమని, నాసిరకం ఆహారం సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ హెచ్చరికలను సైతం క్యాటరింగ్ కాంట్రాక్టర్లు పెడచెవిన పెడుతున్నట్టు తాజా ఉదంతం వెల్లడిస్తోంది.

  • Loading...

More Telugu News