: సచిన్ కు మంగళగిరిలో భూములున్నాయా..?
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు ఆంధ్రప్రదేశ్ లో భూములున్నాయా..? అంటే, 'రియల్' వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. మంగళగిరిలో సచిన్ 100 ఎకరాలు కొన్నట్టు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యేనని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతుండడంతోనే సచిన్ ఇక్కడ భూములు కొన్నాడని కొందరు అంటుండగా... ఇక్కడి భూముల ధరలు పెంచేందుకు ఇదో ఎత్తుగడ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏమైనాగానీ, సచినే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.