: చనిపోయి, బతికిందనుకున్న పాప... ఈసారి నిజంగానే..!
అందరూ చనిపోయిందనుకున్న బాలిక తిరిగి బతికిన ఘటన ఫిలిప్పీన్స్ లో కొన్ని రోజుల క్రితం చోటుచేసుకోవడం తెలిసిందే. అయితే, ఆ బాలిక కుటుంబానికి ఆ ఆనందం ఎక్కువరోజులు మిగల్లేదు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆ చిన్నారి కన్నుమూసిందని వైద్యులు తెలిపారు. దీంతో, ఆ పాప కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బాలిక చనిపోయిందని డాక్టర్లు తేల్చిచెప్పడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.