: బేగంపేటలో మహిళను దుర్భాషలాడిన టీవీ యాంకర్ కు రిమాండ్


తన బైక్ కు దారివ్వలేదని ఓ మహిళపై నోరుపారేసుకున్న లోబో అలియాస్ మహ్మద్ ఖయ్యూం అనే టీవీ యాంకర్ కు రిమాండ్ విధించారు. లోబో 'మా మ్యూజిక్' చానల్లో వీజేగా వ్యవహరిస్తున్నాడు. లోబో శుక్రవారం రాత్రి అమీర్ పేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళే క్రమంలో... బేగంపేట షాపర్స్ స్టాప్ వద్ద ఓ యువతి స్కూటీపై వెళుతూ తనకు దారివ్వలేదని ఘర్షణకు దిగాడు. అసభ్యకరంగా తిట్టడంతో ఆమె బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోబోను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. లోబోకు న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

  • Loading...

More Telugu News