: గాజా నుంచి సురక్షితంగా బయటపడ్డ భారత టైలర్లు
భారత్ కు చెందిన నలుగురు దర్జీలు ఉద్రిక్తంగా మారిన గాజా ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రమల్లాలో ఉన్న భారత సంప్రదింపుల కేంద్రం (ఆర్ఓఐ) అధికారులు గాజా నుంచి బయటపడేందుకు టైలర్లకు సహకరించారు. ఈ నలుగురు టైలర్లు ప్రస్తుతం జోర్డాన్ చేరుకున్నారు. నేడు భారత్ బయల్దేరతారు. వీరిని అబ్దుర్ రహ్మాన్ (లక్నో), అన్వర్ హుస్సేన్ (ముంబయి), కమిల్ (బదాం గంజ్), రషీద్ అహ్మద్ (బరేలీ)గా గుర్తించారు. ఖతార్ నుంచి రెండేళ్ళ క్రితం వీరు గాజా చేరుకున్నారు. అక్కడో ఓ పాలస్తీనా వ్యాపారవేత్త వద్ద దర్జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న దాడుల్లో ఒక్క ఆదివారం నాడే 97 మంది పాలస్తీనా వాసులు విగతులయ్యారు. ఇక, 13 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు.