: మలుపు తిరిగిన జడేజా-ఆండర్సన్ వివాదం!


ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మధ్య చోటు చేసుకున్న వివాదం మలుపు తిరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో ఫుటేజి లేదని ఇంగ్లండ్ క్రికెట్ అధికారులు అంటున్నారు. తొలి టెస్టు రెండోరోజు ఆటలో లంచ్ సమయంలో ఈ వాగ్వివాదం చోటుచేసుకోగా, ఇద్దరు ఆటగాళ్ళవైపు ఫోకస్ చేసిన కెమెరా ఆ సమయంలో క్రియాశీలకంగా లేదని సదరు వర్గాలు చెబుతున్నాయి. దీనిపై టీమిండియా మేనేజ్ మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదానికి సంబంధించిన కీలమైన ఆధారాలు ఎందుకు లభ్యం కావడంలేదని ప్రశ్నించింది. ఈ వివాదంపై నియమించిన ప్రత్యేక కమిటీ వీడియో ఫుటేజి పరిశీలించిన పిదప ఓ నిర్ణయానికి రావాలని భావించిన నేపథ్యంలో తాజా పరిణామంతో విచారణకు బ్రేకులు పడనున్నాయి.

  • Loading...

More Telugu News