: ప్రాజెక్టుల కోసం వైఎస్సార్సీపీ పోరు: తిరుపతి ఎంపీ వరప్రసాద్


మన్నవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం ఓడరేవులను సాధించేందుకు వైఎస్సార్సీపీ పోరు సాగించనుందని ఆ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. రుణ మాఫీపై చంద్రబాబు సర్కారు రోజుకోమాట చెబుతూ పబ్బం గడుపుతోందని ఆయన ఆదివారం ఆరోపించారు. ఎన్నికల ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించడం ద్వారా ప్రజల్లో ఆశలు రేకెత్తించిన బాబు, అధికారం చేపట్టగానే హామీల అమలుపై మీన మేషాలు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు వ్యవహార తీరుతో రాష్ట్ర రైతాంగం అయోమయంలో కూరుకుపోయిందన్నారు. రుణమాఫీపై రిజర్వ్ బ్యాంకు ఇప్పటికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని ఈ సందర్భంగా వరప్రసాద్ చెప్పారు.

  • Loading...

More Telugu News