: ఆరునూరైనా రుణమాఫీ అమలు చేస్తాం: ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు
ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు తమ ప్రభుత్వం వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి తీరతామని ఆయన ఆదివారం విజయవాడలో అన్నారు. కేసీఆర్ నిరంకుశ నిర్ణయాల వల్ల సీమాంధ్ర విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపునకు సంబంధించి కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేంత కాలం తెలంగాణలో విద్యనభ్యసిస్తున్న సీమాంధ్ర విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్లను తెలంగాణ సర్కారే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.