: సెంచరీకి చేరువలో విజయ్ ఔట్!
భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీకి అతి సమీపంలో ఔటయ్యాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్, రెండో ఇన్నింగ్స్ లో భాగంగా ఒంటరి పోరు కొనసాగించిన విజయ్, 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలిటెస్ట్ లో ఓ సెంచరీ, అర్ధ సెంచరీలను నమోదు చేసిన విజయ్, రెండో టెస్ట్ లో సెంచరీ చేరువలో వెనుదిరిగాడు. రెండో టెస్ట్ లో ఆదివారం భోజన విరామ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. జడేజా (37), భువనేశ్వర్ కుమార్ (13) క్రీజులో ఉన్నారు.